TDP Leaders criticism on CM Jagan: వైకాపా ప్రభుత్వం.. రైతుల వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే.. అన్నదాతకు ఉరితాడు బిగించినట్లేనని తెదేపా సీనియర్ నేతలు పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలో తేదేపా ఆధ్వర్యంలో 'రైతు పోరు' కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నియోజకవర్గాల నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, రైతు సంఘం నాయకులు హాజరయ్యారు.
'వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే.. రైతులకు ఉరితాడు బిగించినట్లే' - badwel TDP Rythu Poru success
TDP Rythu Poru in Badvel: వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో తేదేపా ఆధ్వర్యంలో 'రైతు పోరు' కార్యక్రమం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం.. రైతులకు చేస్తున్న ద్రోహాన్ని తీవ్రస్థాయిలో నేతలు ఎండగట్టారు. వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే.. రైతులకు ఉరితాడు బిగించినట్లేనని పేర్కొన్నారు.
!['వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే.. రైతులకు ఉరితాడు బిగించినట్లే' TDP Rythu Poru in Badvel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15650295-1002-15650295-1656089930955.jpg)
TDP Rythu Poru in Badvel
వైకాపా ప్రభుత్వం.. రైతులకు చేస్తున్న ద్రోహాన్ని తీవ్రస్థాయిలో తెలుగుదేశం నాయకులు ఎండగట్టారు. పంటల బీమా ద్వారా రైతులకు తీవ్ర అన్యాయం చేశారని.. మళ్లీ ఇప్పుడు మీటర్లు పెడతామంటూ కొత్త మోసానికి జగన్ రెడ్డి తెరలేపారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా నుంచే రైతు పోరు కార్యక్రమాన్ని తెదేపా మొదలు పెట్టిందని.. రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు తీవ్రం చేస్తామని నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, తదితరులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: