వైకాపా ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించి, రైతులను నట్టేట ముంచుతోందని కడప తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు లింగారెడ్డి ఆగ్రహించారు. కడప ప్రెస్ క్లబ్లో వివిధ పార్టీల ఆధ్వర్యంలో 'రైతుల కోసం' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, సున్నా వడ్డీ రుణాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో రాయితీ విత్తనాలు అందించాలన్నారు. పంటలకు బీమా కల్పించాలని.. నివర్ తుపానుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.