ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబేడ్కర్ విగ్రహానికి తెదేపా పాలాభిషేకం - డాక్టర్ సుధాకర్ కేసుపై తెదేపా వర్గాలు

వైద్యుడు సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడంపై కడప జిల్లా తెదేపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

tdp on doctor sudhaker case
అంబేడ్కర్ విగ్రహానికి తెదేపా పాలాభిషేకం

By

Published : May 23, 2020, 3:55 PM IST

వైద్యుడు సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడాన్ని హర్షిస్తూ కడప జిల్లా ఖాజీపేటలో తెదేపా నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దళితుడైన వైద్యుడు సుధాకర్‌పై పోలీసులతో దాడి చేయించి మానవ హక్కులను కాలరాశారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు.

కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యుడిని గౌరవించకుండా.. సస్పెండ్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత వ్యతిరేక విధానాలను ప్రభుత్వం వీడాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details