కడప జిల్లా గోపవరం మండలం బ్రాహ్మణపల్లె తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు ధనలక్ష్మి కౌంటింగ్ హాల్లో అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఎన్నికల కౌంటింగ్ లెక్కింపు ప్రారంభం నుంచి విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. గెలిచినట్లు ఫలితం తెలియడంతో మరింత ఒత్తిడికి లోనయ్యారు. ఆమెను కౌంటింగ్ హాల్లో నుంచి బయటికి తీసుకువచ్చారు. అనంతరం వైద్య సిబ్బంది ఆమెను పరిక్షించగా బీపీ ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. అనంతరం ఆమెను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
ఉత్కంఠగా కౌంటింగ్..అస్వస్థతకు గురైన తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి - kadapa mptc election result
కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఫలితం ఎలా వస్తుందోనన్న టెన్షన్ ఆమెను వెంటాడింది. తొలి రౌండ్ నుంచి ఆమె ఆధిక్యంలో కొనసాగుతూనే ఉన్నారు. అయినా ఫలితం ఎలా ఉంటుందోనని ఆమె ఆలోచిస్తూనే ఉంది. ఉదయం నుంచి ఒత్తిడిలో ఉన్న ఆమె.. గెలిచినప్పటికీ ఆ వార్త విని మరింత ఉద్వేగానికి లోనై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
కౌంటింగ్ హాల్లోనే తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి అస్వస్థత