కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెదేపా మద్దతుదారులకు రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉన్నామని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమను క్షమించాలని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం లేదని అన్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, ఎర్రచందనం, రౌడీషీటర్ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
'తెదేపా ఓడిపోలేదు... ప్రజాస్వామ్యం ఓటమి పాలైంది' - తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి తాజా న్యూస్
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలకు బలవంతంగా ఏకగ్రీవాలు చేయడం దారుణమని శాసనమండలి సభ్యులు బీటెక్ రవి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెదేపా మద్దతుదారులకు రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉన్నామని కడప జిల్లా పార్టీ కార్యాలయంలోని సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమను క్షమించాలని కోరారు.
'తేదేపా ఓడిపోలేదు... ప్రజాస్వామ్యం ఓటమిపాలైంది'
రాష్ట్రంలో తేదేపా ఓడిపోలేదు.. ప్రజాస్వామ్యం ఓటమి పాలైందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో బలవంతంగా ఏకగ్రీవాలు చేయడం దారుణమని దుయ్యబట్టారు. ఎక్కడో ఏకగ్రీవాలు జరిగితే సీఎం నియోజకవర్గంలోని అన్ని స్థానాలు.. ఏకగ్రీవం కావాలనుకోవడం అవివేకం అని రవి అన్నారు.