ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pulivendula: మా ఫ్లెక్సీలను తొలగించారు సరే.. శంకర్​రెడ్డి వాటికి ఎలా అనుమతిచ్చారు..? - బీటెక్ రవి

Flexi war in Pulivendula: పులివెందులలో తెదేపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించటం దారుణమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా.. వివేకా కేసులో నిందితుడిగా ఉన్న శంకర్​రెడ్డి భారీగా బ్యానర్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మరి, అధికారులు వాటిని ఎందుకు తొలగించలేదని నిలదీశారు. వైకాపా పాలనలో అన్ని ధరలూ పెరిగిపోయాయని.. రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు.

tdp mlc btech ravi
tdp mlc btech ravi

By

Published : Jan 16, 2022, 3:56 PM IST

Flexi war in Pulivendula: నిత్యావసర ధరలపై పులివెందులలో తెదేపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించటంపై తెదేపా నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలపై బ్యానర్లు ఏర్పాటు చేస్తే.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసులు అభ్యంతరం చెప్పటం ఏంటని ప్రశ్నించారు. కీలకమైన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి.. సీఎం జగన్ పుట్టినరోజు, క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన బ్యానర్లు పెడితే ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు.

వందల సంఖ్యలో కట్టిన బ్యానర్లపై ప్రశ్నించని పోలీసులు, మున్సిపల్ అధికారులు.. ప్రజాసమస్యలపై నిలదీస్తే ఇలాంటి చర్యలకు దిగటం దారుణమన్నారు. శాంతిభద్రతల పేరుతో తెదేపా కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

రైతుల సమస్యలను వైకాపా సర్కారు.. గాలికొదిలేసిందని బీటెక్ రవి దుయ్యబట్టారు. ఇంతవరకు ఒక్క రైతుకు కూడా డ్రిప్ మెటిరీయల్ ఇవ్వలేదన్నారు. బీమా విధానం కూడా సరిగాలేదని ఆక్షేపించారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల్లో కూడా పురోగతి లేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక.. అరటి, చీనీ ధరలు ఘోరంగా పడిపోయాయని చెప్పారు.

ఇదీ చదవండి :

Balakrishna - Vasundhara Video: చీరాల బీచ్‌లో బాలయ్య సందడి.. టాప్ లెస్ జీప్‌లో సరదా రైడ్

ABOUT THE AUTHOR

...view details