ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష' - rayachoti

రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే చంద్రబాబుకు, తమకు శ్రీరామరక్షగా నిలిచాయని కడప జిల్లా తెదేపా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

తెదేపా సమావేశం

By

Published : Apr 28, 2019, 6:22 AM IST

తెదేపా నేతల సమావేశం

రాష్ట్రంలో తెదేపా విజయం వైపు నిశ్శబ్ద గాలి వీస్తోందని కడప జిల్లా తెదేపా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాయచోటిలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 60 లక్షల మంది పెన్షన్ దారులు.. కోటి మంది మహిళలు తెదేపాకు అనుకూలంగా ఓటేశారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అమలుచేసిన పథకాలే మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిని చేస్తాయన్నారు. వైసీపీ శ్రేణులు మానసికంగా ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కడప జిల్లాలో మెజార్టీ స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details