ఇసుక కొరతను నిరసిస్తూ కడప జిల్లా మైదుకూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలిపారు. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి నుంచి ప్రభుత్వ కార్యాలయ సముదాయం వరకు ప్రదర్శన నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ప్రభుత్వ కార్యాలయ ప్రవేశద్వారం వద్ద బైఠాయించారు . ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలైంది లక్షలాది మంది కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు అంటూ నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అమరావతి, పోలవరం, ఇసుక విధానాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మైదుకూరులో తెదేపా శ్రేణుల ధర్నా..
ఇసుక కొరతను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వ విధానాలపై నాయకులు ఆగ్రహాంవ్యక్తం చేశారు.
tdp leaders protests at maidukur in kadapa district