విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కడపలో తెదేపా ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి అర్ధనగ్న ప్రదర్శనతో గాంధీ విగ్రహం వరకు వెళ్లారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయటంలో వైకాపా కీలక పాత్ర పోషిస్తోందని ఆరోపించారు.
విశాఖ ఉక్కు పరిరక్షణకు కడపలో తెదేపా నేతల వినూత్న నిరసన - కడపలో తెదేపా నేతల నిరసన
ఆంధ్రుల ఆత్మగౌరవ మైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవాలంటే అన్ని పార్టీలు ఒక్కటిగా.. ఉద్యమిస్తే తప్పక ఫలితం ఉంటుందని పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణకై కడపలో వినూత్న నిరసన
"కడపలో ఎలాగో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయలేదు, ఉన్న ఒక్క విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వారికి ధారాదత్తం చేయటం దారుణమని" ఖండించారు. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటిని ప్రైవేటుపరం చేస్తూ.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండీ..ఉద్ధృతంగా విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం