ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడండి'... ఎస్​ఈసీకీ తెదేపా నేతల వినతి - TDP leaders in kadapa district news

కడప జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని జిల్లా తెలుగుదేశం నేతలు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గతంలో జరిగిన దాడుల వివరాలను ఆయనకు వివరించారు. మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు.

TDP leaders in kadapa district
TDP leaders in kadapa district

By

Published : Jan 30, 2021, 2:59 PM IST

కడప జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్ కుమార్​ను తెలుగుదేశం పార్టీ నేతలు కోరారు. వైకాపా నాయకులు దౌర్జన్యాలకు పాల్పడకుండా, అధికారులు ఏకపక్ష ధోరణితో వ్యవహరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు విన్నవించారు. ఈ మేరకు కడప కలెక్టరేట్​లో తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, కడప పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు లింగారెడ్డి, తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తదితర దేశం నేతలు... ఎస్ఈసీని కిలిసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో వైకాపా నాయకులు దౌర్జన్యం చేశారని ఫిర్యాదు చేశామన్నారు. తమ అనుకూల అభ్యర్థులకు అవసరమైతే నియోజకవర్గానికి ఒకరికి భద్రత కల్పించేలా చూడాలని కోరినట్లు తెలిపారు. కమలాపురం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రిజర్వేషన్లలో అవకతవకలు జరిగాయని చెప్పామన్నారు. విజ్ఞాపనలను పరిశీలించిన ఎస్​ఈసీ రమేశ్ కుమార్... సానుకూలంగా స్పందించారని తెదేపా నేతలు వెల్లడించారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details