ముఖ్యమంత్రి జగన్ నియంతృత్వ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని.. కడప తెదేపా ఇన్ఛార్జ్ అమీర్ బాబు అన్నారు. గుంటూరులో జైల్భరో కార్యక్రమానికి వెళుతున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. మిగతా నేతలనూ నిర్బంధించారు.
పోలీసుల చర్యపై తెదేపా నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వారికి బేడీలు వేసి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రైతుల జోలికి వెళ్లిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని చెప్పారు. ఇప్పటికైనా అరెస్ట్ చేసిన రైతన్నలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.