ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులకు కూతవేటు దూరంలో ఉన్న రైతులకు కూడా న్యాయం చేయలేకపోవడం దారుణమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. ఉల్లి పంటను నష్టపోయిన రైతుకు ఎకరాకు 40,000 నుంచి 50,000 రూపాయలు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం జగన్ రైతు పక్షపాతి అని చెప్పుకుంటూ వారి కొంప ముంచుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ జిల్లా వీరుపునాయనిపల్లె మండలంలోని మొయిల్లా చెరువు, కొమ్మద్ది గ్రామాల్లో పాడైపోయిన ఉల్లి, పత్తి పంటల్ని ఆయన పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాల పేరుతో వందల కోట్లు వృథా చేస్తూ.. నష్టపోయిన రైతుల్ని పట్టించుకోకుండా వారిని నట్టేట ముంచుతున్నారని నరసింహారెడ్డి విమర్శించారు.
ఉల్లి రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి..: తెదేపా - Putta Narasimha Reddy is state vice president TDP
ఉల్లి పంటతో నష్టపోయిన రైతుకు వెంటనే పరిహారం అందించి వారిని ఆదుకోవాలని.. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా వీరుపునాయనిపల్లె మండలంలోని మొయిల్లా చెరువు, కొమ్మద్ది గ్రామాల్లో పాడైపోయిన ఉల్లి, పత్తి పంటల్ని ఆయన పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాల పేరుతో వందల కోట్లు వృథా చేస్తూ.. నష్టపోయిన రైతుల్ని పట్టించుకోకుండా వారిని నట్టేట ముంచుతున్నారని నరసింహారెడ్డి విమర్శించారు.
మొయిల్లా చెరువు కొమ్మద్ది గ్రామం