ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కడప ప్రైవేట్ ఆస్పత్రిలో దోపిడీలు పెరిగిపోతున్నాయి' - కడప ప్రైవేట్ ఆస్పత్రి

కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే కడపలోని ప్రైవేట్ ఆస్పత్రిలో దోపిడీలు పెరిగిపోతున్నాయని కడప జిల్లా తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ధ్వజమెత్తారు. సిటీ స్కానింగ్ పేరిట ప్రజల నుంచి వేల రూపాయలు దోచుకుంటున్నారని మండిపడ్డారు.

tdp leaders conference on private hospitals
కడప ప్రైవేట్ ఆస్పత్రి

By

Published : Aug 27, 2020, 6:25 PM IST

కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే కడపలోని ప్రైవేట్ ఆస్పత్రిలో దోపిడీలు పెరిగిపోతున్నాయని కడప జిల్లా తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ధ్వజమెత్తారు. సిటీ స్కానింగ్ పేరిట ప్రజల నుంచి వేల రూపాయలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. కడప రిమ్స్ లో సిటీ స్కాన్ పరికరం ఏడాది క్రితం పాడైయిందని.. కనీసం దాన్ని మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో కమీషన్లకు కక్కుర్తిపడి వేలకు వేల రూపాయలు ఫీజులను వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడం లేదని చెప్పారు. కరోనా వైద్యం కోసం వెళితే ముందు రెండు లక్షల రూపాయలు అడ్వాన్సు తీసుకుని ఆసుపత్రిలో జాయిన్ చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కరోనాకు సరైన వైద్యం అందించాలని తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details