ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారులో దొరికిన డబ్బుల సంగతి తేల్చండి: తెదేపా - కడప జిల్లా తాజా వార్తలు

రాష్ట్రంలో వైకాపా నాయకులు అక్రమంగా సంపాదించిన డబ్బును రహస్య మార్గాల గుండా విదేశాలకు తరలిస్తున్నారని తెదేపా నాయకులు ఆరోపించారు. తమిళనాడు రాష్ట్రంలో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో 5కోట్ల రూపాయలు తరలించడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

tdp leaders
tdp leaders

By

Published : Jul 17, 2020, 4:11 PM IST

తమిళనాడులో ఎమ్మెల్యే కారులో దొరికిన రూ. 5.27 కోట్లు వైఎస్ భారతి బంధువుకు ఇచ్చేందుకు తీసుకెళుతూ పట్టుబడ్డారని కడప తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. వెంటనే మంత్రి బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కారుకు ఎమ్మెల్యే స్టికర్ అతికించి డబ్బులను సరఫరా చేస్తున్నారని ఆరోపించారు.

తమిళనాడులో పోలీసులకు దొరికిన రూ.ఐదు కోట్లపై సీబీఐ విచారణ చేపట్టాలని తెదేపా నేత కిమిడి నాగార్జున అన్నారు. మంత్రి ఆ డబ్బులు తనవి కాదని బంగారం వ్యాపారిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. లాక్​డౌన్ సమయంలో బంగారం షాపులు తిరిగి తెరవడం లేదని.. అలాంటి సమయంలో ఆ వ్యాపారికి ఐదు కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అనుమానం వ్యక్తం అవుతుందన్నారు.

ఇదీ చదవండి:అయోధ్య రామాలయంపై రేపు కీలక నిర్ణయం!

ABOUT THE AUTHOR

...view details