ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్టీఆర్​ గృహాలను ఇస్తే..తెదేపాకు పేరు వస్తుందని వైకాపాకు భయం'

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా హయాంలో నిర్మించిన దాదాపు 6 లక్షల గృహాలు లబ్ధిదారులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెదేపా రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డిలు సూచించారు. ఇప్పటికైనా జగన్మోహన్​రెడ్డి భేదాభిప్రాయాలు పక్కనపెట్టి అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ గృహాలను ఇవ్వాలని పేర్కొన్నారు. వీటిని నిరుపయోగంగా ఉంచడం వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగమవుతోందని తెలిపారు.

tdp leaders comments on ntr houses
ఎన్టీఆర్​ గృహాలు లబ్ధిదారులకు ఇవ్వాలని తెదేపా నాయకులు నిరసన

By

Published : Jul 6, 2020, 3:59 PM IST


తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన ఎన్టీఆర్ గృహాలను తక్షణం అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని తెదేపా రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డిలు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు అత్యాధునిక సౌకర్యాలతో గృహాలను నిర్మించారని.. వాటిని పంపిణీ చేస్తే తెదేపాకు పేరు వస్తుందనే ఉద్దేశంతో వాటిని పక్కన పెట్టడం దారుణమని ఖండించారు. కడప శివారులో నిర్మించిన ఎన్టీఆర్ గృహాలను పరిశీలించిన నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కొండల్లో, కోనల్లో ఇచ్చిన గృహాల్లా కాకుండా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇలాంటి భవనాలను లబ్ధిదారులకు అందజేయాలని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details