పోలీసులు, అధికారుల సాయంతో కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీని దక్కించుకోవడానికి వైకాపా ప్రయత్నిస్తోందని తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు. నైతికంగా ప్రజల ఓట్లతో తెదేపా 12 వార్డుల్లో గెలిస్తే, ఒక అభ్యర్థిని వైకాపా కిడ్నాప్ చేసిందన్నారు. పోలీసులే తెదేపా వార్డు మెంబర్ను వైకాపాకి అప్పగించారని ఆరోపించారు.
'మైదుకూరు మున్సిపాలిటీని దక్కించుకోవడానికి వైకాపా యత్నిస్తోంది' - tdp leader putta Sudhakar on maidhukur mayor elections
కడప జిల్లా మైదుకూరు ఛైర్మన్ ఎన్నికల సమయంలో తెదేపా అభ్యర్థులు హాజరుకాకుండా పోలీసులు యత్నిస్తున్నారని తెదేపా నేత పుట్టా సుధాకర్ ఆరోపించారు. తెదేపా అభ్యర్థులకు ఏం జరిగినా పోలీసులు, వైకాపా బాధ్యత వహించాలని అన్నారు.
tdp leader sudhaker yadhav comments on maidhukuru municipal elections
పోలీసులు తీరుని ప్రశ్నించామన్న అక్కసుతో తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టారని సుధాకర్ యాదవ్ అన్నారు. ఈ నెల 18వ తేదీన జరిగే ఛైర్మన్ ఎన్నికకు తెదేపా వారిని హాజరుకాకుండా చూడాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆరోజు మైదుకూరులో తెదేపా అభ్యర్థులకు ఏం జరిగినా పోలీసులు, వైకాపా బాధ్యత వహించాలన్నారు.
ఇదీ చదవండి: 'రాజకీయ బీభత్సం సృష్టించేందుకే ఇలాంటి చర్యలు'