రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరిచి వైకాపా ప్రభుత్వం అరాచకానికి తెర లేపిందని తెదేపా కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. భౌతిక దూరాన్ని మరిచి మద్యం షాపుల మీదకి జనాలను తోసేశారని విమర్శించారు. మద్యం దుకాణాలతో ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అక్రమ సంపాదన, వసూళ్ల కోసం తాపత్రయ పడుతోందని ఆరోపించారు. మద్యం అమ్మకాలపై ఉన్న తాపత్రయం... రైతులు మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. వెంటనే మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు.
'వైకాపా ప్రభుత్వం అరాచకానికి తెర లేపింది'
కరోనా సమయంలో మద్యం అమ్మకాలను ప్రారంభించడాన్ని తెదేపా ఖండించింది. అక్రమ సంపాదన కోసం రాష్ట్ర ప్రభుత్వం తాపత్రయపడుతోందని పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మద్యం అమ్మకాలను నిలిపివేయాలని హితవు పలికారు.
tdp leader srinivasa reddy
ఇదీ చదవండి..