గుంటూరు జైల్భరో కార్యక్రమంలో మహిళలతో పోలీసులు వ్యవహరించిన తీరుపై కడప పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి ధ్వజమెత్తారు. సీఎం జగన్కు మహిళలంటే కనీస గౌరవం కూడా లేదని మండిపడ్డారు. అమరావతి రైతులు అడుగుతున్న న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించడంలో జగన్ మొండి వైఖరి అవలంబించడం సరైంది కాదని ఖండించారు.
మహిళల ఓట్లు అయితే కావాలి కానీ.. వారి సమస్యల పరిష్కారం అక్కర్లేదా అంటూ ఆమె ప్రశ్నించారు. రాజధాని అమరావతిలో ఉండడం వల్ల సీఎంకు నష్టమేంటని ప్రశ్నించారు. మూడు రాజధానుల వల్ల కలిగే లాభాలు ఏంటో అందరికీ తెలియజేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజురోజుకూ అమ్మాయిలపై, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయని... మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన చెందారు.