చిత్తూరు జిల్లాలో కురబలకోట మండలం అంగళ్లులో తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని కడప పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు లింగారెడ్డి ధ్వజమెత్తారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కాన్వాయ్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లింగారెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి' - చిత్తూరులో తెదేపా నేతలపై దాడి అప్డేట్స్
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కడప పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు.
కడప పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు లింగారెడ్డి
దాడికి కారణమైన వారిని అరెస్టు చేయాలని లింగారెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని లింగారెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి: ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పని ఉందా..? : హైకోర్టు