కడప జిల్లా రైల్వేకోడూరు మండలం గుంజన నదిలో సరదాగా ఈతకు వెళ్లి రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతుల కుటుంబాలను తెదేపా సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ పరామర్శించారు. గుర్రప్పాలెం గ్రామనికిచెందిన పెంచలయ్య ఇంటికి చేరుకుని, అతని తల్లిదండ్రులకు కొంత ఆర్థిక సహాయం అందజేశారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు.
మృతిచెందిన యువకుల కుటుంబాలకు తెదేపా నేత పరామర్శ - Gunjana river newws
రెండు రోజుల వ్యవధిలోనే రైల్వేకోడూరు మండలం గుంజన నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారి కుటుంబాలను తెదేపా నేత పంతగాని నరసింహ ప్రసాద్ పరామర్శించారు. ఏ కష్టం వచ్చినా తెదేపా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. నదిలోకి ఎవరూ ఈతకు వెళ్లకూడదని గ్రామస్థులకు సూచించారు.
![మృతిచెందిన యువకుల కుటుంబాలకు తెదేపా నేత పరామర్శ tdp leader deceased](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9934360-993-9934360-1608376817072.jpg)
తెదేపా నేత పరామర్శ
ఏ కష్టం వచ్చినా తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం గుండాలపల్లెలో శివరామకృష్ణ కుటుంబసభ్యులను కలిశారు. నదిలోకి ఎవరూ ఈతకు వెళ్లకూడదని గ్రామస్థులకు సూచించారు.
ఇదీ చదవండి: మౌలిక వసతులు కల్పించరు... పరిహారం ఇవ్వరు..!