రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగుదేశం నేత నందం సుబ్బయ్య హత్య కేసులో... ఆయన భార్య అపరాజిత పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపైనే ఆరోపణలు చేస్తున్నారామె. తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్లను పోలీసులు మార్చారని వాపోతున్నారు. తన భర్త సెల్ ఫోన్ ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీస్ కమిషనర్ ఫోన్ చేస్తేనే తన భర్త వెళ్ళారని అపరాజిత చెబుతున్నారు. హత్యకు గురైన తన భర్తపైనే వైకాపా నేతలు అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఇంట్లో తన భర్త ఏళ్ల తరబడి పని చేశాడన్న అపరాజిత.. హత్యకు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, బంగారు రెడ్డి కారణమని ఆరోపించారు.
ఫిర్యాదులో పేర్లను పోలీసులు మార్చేశారు: సుబ్బయ్య భార్య - తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య
తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య కేసులో పోలీసుల తీరుపై ఆయన భార్య తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్లను పోలీసులు మార్చేశారని ఆమె అన్నారు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, బంగారు రెడ్డి హస్తం ఈ కేసులో ఉందన్నారు.
Subbaya wife
తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం నుంచి ఆయన ఇంటివద్ద రెక్కీ చేసిన దుండగులు.. ప్రణాళిక ప్రకారం బయటకు రప్పించి కిరాతకంగా హత్య చేశారు.
ఇదీ చదవండి:కళ్లలో కారం కొట్టి.. వేటకొడవళ్లతో నరికి..!
Last Updated : Dec 30, 2020, 2:33 PM IST