వచ్చే ఎన్నికల్లో కడప జిల్లా ప్రొద్దుటూరు తెదేపా ఎమ్మెల్యే టికెట్ పొందే అర్హత తనకు మాత్రమే ఉందని కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు తెదేపా ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్‌రెడ్డికి టికెట్ ఖారారైనట్లు వార్తలు వస్తున్నాయని.. అందులో వాస్తవం లేదని అన్నారు. అభ్యర్థిని ప్రకటిస్తే.. తెదేపా కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వస్తుందన్నారు.
'నా కంటే సీనియర్ ఎవరూ లేరు.. ఎమ్మెల్యే టికెట్ నాకే వస్తుంది' - ప్రొద్దుటూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి
కడప జిల్లాలో తన కంటే సీనియర్ నేత ఎవరూ లేరని.. వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరు తెదేపా ఎమ్మెల్యే టికెట్ పొందే అర్హత తనకు మాత్రమే ఉందని కడప పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డి స్పష్టం చేశారు. ప్రవీణ్ కుమార్‌రెడ్డికి టికెట్ ఖారారైనట్లు వార్తలు వస్తున్నాయని.. అందులో వాస్తవం లేదని అన్నారు.
'నా కంటే సీనియర్ ఎవరూ లేరు.. ఎమ్మెల్యే టికెట్ నాకే వస్తుంది'
జిల్లాలో తన కంటే సీనియర్ నేత ఎవరూ లేరని, కచ్ఛితంగా ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థిగా అధిష్ఠానం తననే ఖరారు చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. నామినేటెడ్ పదవులు ఆశించనన్న లింగారెడ్డి.. ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :
ap new districts: ఆ జిల్లాల కోసం అత్యధికంగా వినతులు వచ్చాయి - విజయ్ కుమార్