కడప తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ మాట్లాడుతూ.. కడప నగరంలో రోడ్లు, మురుగు కాలువల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన మండిపడ్డారు. అధికారులు వారికి నచ్చిన చోట్ల రోడ్లు వేసుకోవడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో రోడ్లన్నీ దెబ్బతింటే వాటి గురించి పట్టించుకోని అధికారులు...నాయకుల కార్యాలయాలకు రోడ్డు వేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీకి సంబంధించిన ప్రహరీ కూల్చివేయడం దారుణమని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా నాయకుల తీరుపై మండిపడ్డ తెదేపా ప్రధాన కార్యదర్శి
కడపలో మురుగు కాలువలు, రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే.. నాయకులు, అధికారులు వారికి నచ్చిన చోట రోడ్లు వేసుకోవటం దారుణమని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి త్వరగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మాట్లాడుతున్న తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి