ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలపై విమర్శలు దారుణం' - undefined

ప్రకృతి విపత్తుతో పాటు ఇతర సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తుంటే వైకాపా, భాజపా నేతలు విమర్శలు చేయడం దారుణమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వెంకటసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమీక్షలపై ఆరోపణలు చేయటం దారుణం: వెంకటసుబ్బారెడ్డి

By

Published : May 4, 2019, 5:59 PM IST

సమీక్షలపై ఆరోపణలు చేయటం దారుణం: వెంకటసుబ్బారెడ్డి

రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తుంటే... వైకాపా, భాజపా నాయకులు ఆరోపణలు చేయటం దారుణమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఖండించారు. సమీక్షలు డబ్బులు దోచుకునేందుకే.. అని వ్యాఖ్యానించటం సమంజసం కాదని అన్నారు. పోలవరంపై సమీక్షలు చేయటం సీఎంకు కొత్తమే కాదని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు ఎంత దూరమైనా వెళ్తారని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం మోదీ, జగన్ చేతిలో ఉన్నట్టుగా... ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details