"సోలార్ పరికరాల ధ్వంసం దారుణం" - tdp
సోలార్ పరిశ్రమలో చొరబడి పరికరాలు ధ్వంసం చేయడాన్ని తెదేపా సీనియర్ నేత పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి ఖండించారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లా మైలవరం మండలంలో సోలార్ పరిశ్రమలో చొరబడి సౌర పలకలను ధ్వంసం చేయడం చాలా దారుణమని తెదేపా సీనియర్ నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే జమ్మలమడుగు నియోజకవర్గానికి ఫ్యాక్షన్ ముద్ర ఉందన్నారు. ఈ కారణం చేత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చాలా మంది సుముఖత చూపడం లేదని తెలిపారు. సుమారు ఆరు వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సౌర పరిశ్రమపై దాడి చేసి రెండు వేల పలకలను నాశనం చేయడం అనాగరికమని చెప్పారు. ఈ విధ్వంసంలో సుమారుగా మూడు కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి... విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.