కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా నేతలపై అక్రమ కేసులు పెడుతూ ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతినివ్వట్లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా నేతలతో కలిసి ఓ వర్గం పోలీసులు వ్యవహరిస్తున్న ఈ విధానాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు చంద్రబాబు లేఖ - kadapa district latest news
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. వైకాపా నేతలతో కలిసి ఓ వర్గం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
![ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు చంద్రబాబు లేఖ tdp leader chandrababu naidu wrote a letter to sec ramesh kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10924494-153-10924494-1615215044182.jpg)
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు చంద్రబాబు లేఖ
మైదుకూరు మున్సిపాలిటీలో గెలుపు కోసం అధికార పార్టీ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ మధుసూధన్ గౌడ్, ఎస్సై సుబ్బారావు తదితరులు తెదేపా అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ అధికారులపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవటంతో పాటు తెదేపా సానుభూతిపరులపై పెట్టిన తప్పుడు కేసులను తొలగించాలని కోరారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను పటిష్ఠం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.