తెదేపా రాష్ట్రంలో బలమైన కార్యవర్గం ఏర్పాటు చేసిందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన పుత్తా నరసింహా రెడ్డి అన్నారు. ఈ పదవి తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. అహర్నిశలు కష్టపడి పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని అన్నారు. అనంతరం కార్యకర్తలు.. పుత్తా నరసింహారెడ్డికి శుభాకాంక్షలు తెలిపి, పూలమాలలతో సన్మానం చేసి, కేక్ కట్ చేశారు.
'పదవి నాకు మరింత బాధ్యతను పెంచింది' - కడప జిల్లా తెదేపా నేతలు తాజా వార్తలు
తెదేపా ఉపాధ్యక్షుడిగా తనను ఎంపిక చేసినందుకు చంద్రబాబు, లోకేష్లకు కృతజ్ఙతలని కడప జిల్లాకు చెందిన పుత్తా నరసింహారెడ్డి తెలిపారు. ఉపాధ్యక్షుడిగా ఎంపికైన ఆయనను కార్యకర్తలు కలిసి పూలమాలతో సత్కరించారు.
జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన పుత్తా నరసింహా రెడ్డి