ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కోల్పోయారని... వెంటనే రాజీనామా చేయాలని కడప జిల్లా తేదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్ధమైన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు సైతం తప్పు పట్టిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి లేని విధంగా అరవై మూడు సార్లు కోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ ఆయనలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ విషయంలో జగన్ మోహన్ రెడ్డి అతిగా స్పందించారని విమర్శించారు.
జగన్ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కోల్పోయారు - ysrcp one year government latest news
కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ వైకాపా ఏడాది పాలనపై విరుచుకుపడ్డారు. ఏ ఆర్థిక సహాయం కూడా పూర్తిస్థాయిలో అర్హులకు అందలేదని తెదేపా నేతలు దుయ్యబట్టారు.
కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్
ఇవీ చూడండి...