ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకేపాడులో తెదేపా ఏజెంట్లపై వైకాపా దాడి - akepadu

ఆకేపాడు పోలింగ్ కేంద్రాల్లోని తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. కేంద్రాల నుంచి బయటకు లాగి విచక్షణ రహితంగా చితకబాదారు.

ఆకేపాడులో తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు.

By

Published : Apr 11, 2019, 5:52 PM IST

Updated : Apr 11, 2019, 7:19 PM IST

ఆకేపాడులో తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు.

కడప జిల్లా ఆకేపాడులో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మూడు పోలింగ్ కేంద్రాల్లోని తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఉదయం మాక్ పోలింగ్ సమయంలో వైకాపా నేతలు తెదేపా ఏజెంట్లను బెదిరించారు. ఆ సమయంలో అక్కడికెళ్లిన తెదేపా అభ్యర్థి బత్యాల చంగల్ రాయుడు కలుగజేసుకుని అభ్యంతరం చెప్పటంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం తెదేపా ఏజెంట్లను బయటకు లాగి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇద్దరికి తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Last Updated : Apr 11, 2019, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details