ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి' - కడప జిల్లా తాజా వార్తలు

ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.

tdp demands to arrest accused in the Subbaiah murder case
నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి

By

Published : Dec 29, 2020, 4:35 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకు నిరసనగా ఆందోళన చేపట్టారు. సుబ్బయ్య హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ పాలనలో రోజురోజుకు దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు లింగారెడ్డి, అమీర్ బాబు, వెంకటసుబ్బారెడ్డి, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details