ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'టిడ్కో గృహ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లులు వెంటనే చెల్లించాలి' - kurnool dist latest news

తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం టిడ్కో పథకం కింద నిర్మించిన లక్షలాది గృహాలను సీఎం ఎందుకు పంపిణీ చేయడం లేదో తెలపాలన్నారు. ఇళ్ల పంపిణీ జరిగితే చంద్రబాబుకు పేరు వస్తుందనే అక్కసుతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. టిడ్కో పథకం లబ్ధిదారులకు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

tdp demand
టిడ్కో గృహ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లులు

By

Published : Nov 8, 2020, 11:00 PM IST

గత ప్రభుత్వం చేపట్టిన టిడ్కో గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు బిల్లులు వెంటనే చెల్లించాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా రాజంపేటలో ఆయన సమావేశం నిర్వహించారు. పేదల సొంతిటి కల నెరవేర్చేందుకు టిడ్కో పథకం కింద తాము లక్షలాది గృహ నిర్మాణాలు పూర్తి చేసినా.. సీఎం వాటిని పంపిణీ చేయడం లేదన్నారు. ఇళ్ల పంపిణీ జరిగితే చంద్రబాబుకు పేరు వస్తుందనే అక్కసుతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు గృహ నిర్మాణాలకు.. బ్యాంకుల నుంచి లబ్ధిదారులు తీసుకున్న మొత్తాన్ని తానే చెల్లిస్తానని చెప్పిన జగన్ హామీ నిలబెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details