అంజాద్ బాషా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ తనకు కరోనా సోకిన విషయం బయటకు చెప్పకపోవడం విడ్డూరంగా ఉందని తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. అంజాద్‌బాషా ఇంట్లో ఉంటూనే వైద్యం పొందుతున్నారని చెప్పారు. మంత్రి అంజాద్‌బాషాకు కరోనా పాజిటివ్ సోకిందన్న విషయం అధికారులూ వెల్లడించక పోవడం దారుణమన్నారు. లాక్ డౌన్ సమయంలోనూ అంజాద్ బాషా ప్రజలను వెంటబెట్టుకుని వీధులన్నీ తిరిగారని ఆరోపించారు.
'మంత్రి అంజాద్‌బాషాకు కరోనా వచ్చిందా? లేదా? ప్రకటించాలి' - అంజాద్ బాషాకు కరోనా
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాకు కరోనా వచ్చిందని తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు. ఆ విషయాన్ని బయటకు చెప్పడం లేదని వారు ఆరోపించారు.
తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్