ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంక్రాంతిలోగా ఇళ్లు ఇవ్వకపోతే స్వాధీనం చేసుకుంటాం' - TDP Cadre Protest across the state

రాష్ట్రవ్యాప్తంగా 109 నియోజకవర్గాల్లో... 1420 ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చేశాయి. డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు ఇళ్లు స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. టిడ్కో గృహాలను ప్రభుత్వం సంక్రాంతిలోగా కేటాయించకపోతే... తామే లబ్ధిదారులకు స్వాధీనం చేస్తామని తెదేపా నేతలు హెచ్చరించారు.

TDP Cadre Protest across the state
'సంక్రాంతిలోగా ఇళ్లు ఇవ్వకపోతే స్వాధీనం చేసుకుంటాం'

By

Published : Nov 8, 2020, 5:09 AM IST

'నా ఇల్లు నా సొంతం-నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి'... పేరిట రాష్ట్రవ్యాప్తంగా 109 నియోజకవర్గాల్లో... 14 వందల 20 ప్రాంతాల్లో తెలుగుదేశం శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆ పార్టీ ప్రకటించింది. భూసేకరణలో అవినీతి జరిగిందంటూ ఆందోళనలు చేపట్టారు. హౌసింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించడంతో పాటు... డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు ఇళ్లు స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఒక్క పేద కుటుంబానికీ ఇల్లు కానీ, సెంటు స్థలం కూడా ఇవ్వలేదని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కృష్ణా జిల్లా గన్నవరంలో అన్నారు. కడప జిల్లా ఎర్రగుంట్లలోని టిడ్కో గృహాలను ప్రభుత్వం సంక్రాంతిలోగా కేటాయించకపోతే... తామే లబ్ధిదారులకు స్వాధీనం చేస్తామని తెదేపా నేతలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details