ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సుబ్బయ్య కుటుంబానికి చేనేతలు అండగా ఉండాలి' - tdp leader subbaiya murder case latest news

కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత సుబ్బయ్య హత్యను ఖండిస్తూ ప్రతి నియోజకవర్గంలో నిరసనలు తెలపాలని ఆ పార్టీ బీసీ నాయకులు అన్నారు. నందం సుబ్బయ్య కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందన్నారు.

tdp bc leaders on advocate subbaiyya murder
tdp bc leaders on advocate subbaiyya murder

By

Published : Dec 31, 2020, 2:17 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య కుటుంబానికి అండగా నిలిచేందుకు చేనేతలంతా ఏకం కావాలని ఆ పార్టీ బీసీ నాయకులు పిలుపునిచ్చారు. వైకాపా హత్యా రాజకీయాలను ఖండిస్తూ ప్రతి నియోజకవర్గంలో నిరసనలు తెలపాలని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కోరారు.

ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది, కమిషనర్ రాధ పేర్లను ఎఫ్​ఐఆర్​లో చేర్చాలని బీసీ నాయకులు, చేనేత వర్గానికి చెందిన నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో అన్నారు. అడ్వకేట్ సుబ్బయ్య హత్య.. వైకాపా ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పరాకాష్ట అని తెదేపా నేతలు దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details