ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్నశెట్టిపల్లెలో తెదేపా-వైకాపా వర్గీయుల ఘర్షణ - kadapa district covid latest updates

చిన్న‌శెట్టి ప‌ల్లెలో తెదేపా, వైకాపా వ‌ర్గీయుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ప‌లువురికి గాయాల‌య్యాయి. ఎస్సీ కాల‌నీలో నిత్యావ‌స‌ర స‌రకులు పంపిణీ విష‌యంలో ఇరువ‌ర్గాలకు గొడవ జరిగింది.

tdp and ycp followers fight at chinsettipalli village in kadapa district
తెదేపా వైకపా వర్గీయుల ఘర్షణ

By

Published : Apr 22, 2020, 10:46 PM IST

కడప జిల్లా రాజుపాళెం మండలం చిన్నశెట్టిపల్లెలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో పలువురికి గాయాలయ్యాయి. ఎస్సీ కాలనీలో నిత్యావసరాలు పంపిణీ చేసే విషయంలో ఇరువర్గాలు మధ్య గలాట జరిగింది. రాళ్లు, కట్టెలతో దాడి చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. గాయపడ్డ వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు సీఐలు విశ్వనాథరెడ్డి, సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.

ABOUT THE AUTHOR

...view details