ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Agitations on CBN Arrest in AP: 'సైకో హటావో.. సైకిల్ బచావో'.. నినాదాలతో హోరెత్తించిన టీడీపీ శ్రేణులు.. - Protests Against CBN Arrest

TDP Agitations on CBN Arrest in AP: చంద్రబాబు నాయుడు అరెస్టును టీడీపీ ఖండించింది. ఆయనపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి.. వెంటనే విడుదల చేయాలంటూ టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనలు, రిలేదీక్షలు, నిరాహార దీక్షలు చేపట్టాయి.

TDP_Agitations_on_CBN_Arrest_in_AP
TDP_Agitations_on_CBN_Arrest_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 2:05 PM IST

TDP Agitations on CBN Arrest in AP: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసును ఎత్తివేయాలనే డిమాండుతో వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో చేపట్టిన రిలేదీక్షలు ఎనిమిదోరోజు కొనసాగుతున్నాయి. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ పుట్టా సుధాకర్‌యాదవ్‌ నాయకత్వంలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలేదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నాయకులు కక్షసాధింపు రాజకీయాలను మానుకోవాలని డిమాండు చేశారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు మద్దతు ప్రకటించి రిలేదీక్షలు చేపట్టారు.

Telugu People Protest Against CBN Arrest in America చంద్రబాబు ఆరెస్టుపై అగ్రరాజ్యంలో ఆందోళనలు.. డల్లాస్, వాషింగ్టన్ పురవీధుల్లో తెలుగు ప్రజల ర్యాలీలు

Protests Against Chandrababu Arrest: చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు వ్యతిరేకిస్తూ ఆర్కేబీచ్​ వద్ద విశాఖ దక్షిణ నియోజక వర్గ టీడీపీ ఇంఛార్జ్ గండి బాబ్జి జలదీక్ష చేశారు. సముద్ర నీళ్లలో నిలబడి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో నల్ల బెలూన్​లు ఎగుర వేసి టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి.

Protest Abroad Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై మిన్నంటిన నిరసన.. విదేశాల్లో తెలుగు ప్రజల ఆందోళన

TDP Agitations Across AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గానికి చెందిన మహిళలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి, మాజీ ఎమ్మెల్యే బండారు సతీమణి కమలాదేవిలు దీక్షకు సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అరాచకాలకు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారన్నారు.

NRIs Protest Against Chandrababu Arrest: బాబు అరెస్టును నిరసిస్తూ విదేశాల్లో నిరసనల వెల్లువ.. అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్..

Chandrababu Followers Protest: చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కొంతమంది పార్టీ నాయకులు కార్యకర్తలు తొమ్మిది రోజులుగా నిరాటంకంగా దీక్షలలో పాల్గొనటం విశేషం. నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు శేషారావుతో పాటు దీక్షలలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి ముఖ్య మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Protest in Khammam ON CBN Arrest ఖమ్మం ఖిల్లా కదిలింది.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణుల భారీ ర్యాలీ

Telugu People Protest Against CBN Arrest: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్​ను నిరసిస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ముస్లిం మైనారిటీ నాయకులు 8వరోజు రిలే నిరహార దీక్ష చేపట్టారు. 'సైకో హటావో.. సైకిల్ బచావో' అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Protests Against CBN Arrest: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ శ్రేణులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మోకాళ్లపై కూర్చొని అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'సైకో పోవాలి.. సైకిల్ రావాలి' అనే నినాదంతో హోరెత్తించారు. టీడీపీ నిరాహారదీక్షకు రైతు సంఘం నేతలు మద్దతు తెలిపి.. దీక్షలో పాల్గొన్నారు.

Agitations on Chandrababu Arrest in AP: మరోవైపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు నల్ల కండువాలు వేసుకొని దీక్షలో కూర్చున్నారు. సీఎం.. డౌన్ డౌన్.. అంటూ ఆందోళనలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నినదించాయి. చంద్రబాబు నాయుడు అక్రమ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు.

TDP Activists Protest Across Andhra Pradesh: చంద్రబాబు అరెస్ట్​పై ఆగని ఆందోళనలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details