ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇందుకేనా అధికారంలోకి వచ్చింది?' - విద్యుత్ ధరలపై తెదేపా నిరసన

ఒక్క అవకాశం ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలకు విద్యుత్ షాక్​ ఇచ్చారంటూ కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ధ్వజమెత్తారు. వచ్చిన కరెంటు బిల్లులను రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

tdp agitation on current bills
విద్యుత్ ఛార్జీల పెంపుపై తెదేపా నిరసన

By

Published : May 21, 2020, 10:42 AM IST

ప్రమాణ స్వీకారం రోజు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన జగన్​మోహన్​రెడ్డి ఏడాది గడవకముందే ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. లాక్​డౌన్ తరువాత వచ్చిన 3 నెలల కరెంటు బిల్లులను రద్దు చేయాలని కోరుతూ... కడపలోని తన స్వగృహంలో 12 గంటల పాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్... ప్రజలకు విద్యుత్ షాక్ ఇచ్చారని ధ్వజమెత్తారు. విద్యుత్ బిల్లులు చెల్లించలేక ప్రజలు అల్లాడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే జగన్​కు ఇదే ఆఖరి పాలన అని జోస్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details