ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ బుద్ధిని మార్చాలంటూ... వైఎస్ఆర్​కు వినతి పత్రం..! - tdp agitation for 3 capirals in kadapa

మూడు రాజధానులను ప్రకటించడంపై కడపలోని అమరావతి పరిరక్షణ ఐకాస నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కొడుకు జగన్ బుద్ధిని మార్చాలంటూ వైఎస్ఆర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు.

tdp agitation for 3 capirals in kadapa
జగన్​ బుద్ధిని మార్చాలంటూ వైఎస్ఆర్​కు వినతి పత్రం..!

By

Published : Jan 21, 2020, 10:17 AM IST

మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ... కడపలో అమరావతి పరిరక్షణ ఐకాస నాయకులు వైఎస్ఆర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జగన్మోహన్​ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వైయస్ఆర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. కొన్ని వందల మంది రైతులు రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబుపై ఉన్న కక్షతోనే రాజధానిని మార్చారని ఆరోపించారు. రాజధాని విషయంలో ఉద్యమించడానికి ఎంత దూరమైనా వెళ్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆలోచించి రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అమరావతి పరిరక్షణ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

జగన్​ బుద్ధిని మార్చాలంటూ వైఎస్ఆర్​కు వినతి పత్రం..!

ABOUT THE AUTHOR

...view details