తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలోని ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్థన్ రెడ్డి పాలాభిషేకం చేసి గజమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం 40 కిలోల కేక్ కట్ చేసి కార్యకర్తలకు ప్రజలకు పంచారు. పార్టీ స్థాపించిన అనతికాలంలోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు హయాంలో రాష్ట్రంలో ఎన్నో పథకాలను ప్రాజెక్టులను నిర్మించారని పేర్కొన్నారు. కడప జిల్లాకు చెందిన పది మందికి మంత్రి పదవులు కల్పించిన ఘనత ఒక్క ఎన్టీరామారావు దక్కిందన్నారు.
ఖాజీపేటలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి కేసీ కాలువ సాగు నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పూలమాల వేశారు. పార్టీ పతాకాన్ని ఎగుర వేశారు.