కడప పెద్ద దర్గాను సినీ నటుడు తారకరత్న దర్శించుకున్నారు. దర్గాను దర్శించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. సినిమా చిత్రీకరణలో భాగంగా కడప వచ్చిన తారకరత్న ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గాను దర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పూల చాదర్‌ను దర్గాలో అందజేశారు.
కడప పెద్ద దర్గాను దర్శించుకున్న తారకరత్న - కడప దర్గాపై వార్తలు
కడప పెద్ద దర్గాను సినీ నటుడు తారకరత్న దర్శించుకున్నారు. దర్గాలో పూల చాదర్ అందజేశారు.
![కడప పెద్ద దర్గాను దర్శించుకున్న తారకరత్న Tarakaratna visit the dargah of Kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9079095-115-9079095-1602038752895.jpg)
కడప పెద్ద దర్గాను దర్శించుకున్న తారకరత్న
నిర్వాహకులు దర్గా విశిష్టతను ఆయనకు తెలియజేశారు. పెద్ద దర్గా గురించి గతంలో చాలామంది తన దృష్టికి తీసుకొచ్చారని.. ఇప్పుడు దర్శించుకునే భాగ్యం లభించిందని తారకరత్న పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమూలంగా తొలగిపోవాలని ప్రార్థించినట్లు తారకరత్న తెలిపారు. పెద్ద దర్గాకు ఎంతో విశిష్టత ఉందని అన్నారు.
ఇదీ చదవండి: జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు