ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్రచందనం స్మగ్లింగ్.... 12 మంది తమిళ కూలీల అరెస్టు - కడప క్రైమ్ వార్తలు

కడప జిల్లా కొండూరు ఫారెస్టులోని కలబంకుంట సమీపంలో ఎర్రచందనం వృక్షాలను నరికి మొద్దులుగా తయారుచేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్న తమిళ కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

arrest
arrest

By

Published : Feb 26, 2020, 10:44 AM IST

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

కడప జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లె చెరువు సమీపంలో 12 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బి.విజయ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసు సబ్‌డివిజనల్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొండూరు ఫారెస్టులోని కలబంకుంట సమీపంలో ఎర్రచందనం వృక్షాలను నరికి మొద్దులుగా తయారుచేసి అక్రమ రవాణాకు పాల్పడుతుండగా గోపవరం ఎస్సై లలితతో కలిసి బద్వేలు రూరల్‌ సీఐ చలపతి, అట్లూరు ఎస్సై శ్రీకాంత్‌, ఏఎస్‌ఐ నరసింహారావు 12 మంది తమిళ కూలీలను అరెస్టు చేశారన్నారు. వారి వద్ద నుంచి 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై, వేలూరు జిల్లాలకు చెందిన ముగ్గురు మేస్త్రీలు తమిళ కూలీలను అటవీ ప్రాంతంలోకి పంపినట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడినా, తమిళ కూలీలకు సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. గతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై నిఘా ఉంచినట్లు చెప్పారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details