కడప జిల్లా వీరబల్లి మండలం సానిపాయి సెక్షన్ పరిధిలోని అటవీ ప్రాంతలో ఎర్రచందనం దుంగలు నరుకుతున్న 5మంది తమిళ కూలీలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రోళ్ళమాడుగు సమీపంలోని బుడ్డ దొనసాపులు ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. చాకచక్యంగా వ్యవహరించి కూలీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.లక్ష విలువైన 8దుంగలు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కూంబింగ్‌లో బేస్ క్యాంప్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఐదుగురు కూలీలు అరెస్ట్ - Tamil laborers arrested with red sandalwood at Veeraballi
కడప జిల్లా వీరబల్లిలో అనుమతి లేకుండా ఎర్రచందనం దుంగలు నరుకుతున్న 5మంది తమిళ కూలీలను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.లక్ష విలువైన 8దుంగలు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tamil laborers arrested