ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైవీయూ పీజీ, ఏపీ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల

కడప యోగి వేమన విశ్వవిద్యాలయం పీజీ సెట్​ ఫలితాలు విడుదల చేసింది. అందులో బద్వేలు శ్రీ రాచపూడి నాగభూషణం కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

students who got pgcet ranks
ర్యాంకులు సాధించిన విద్యార్థులు

By

Published : Oct 24, 2020, 2:25 PM IST

Updated : Oct 24, 2020, 2:33 PM IST

కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయం పీజీ సెట్​ ఫలితాలు విడుదలయ్యాయి. బద్వేలులోని శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ & పీజీ కళాశాల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ఫిజిక్స్ విభాగంలో సుబ్బయ్య మొదటి ర్యాంకు, రాజేశ్వరి- 2, పావని-6వ ర్యాంకు సాధించారు.

గణిత విభాగంలో నారాయణమ్మ, మస్తాన్ మొదటి ర్యాంకు సాధించారు. కామర్స్​లో ఖాదర్ భాష 30వ ర్యాంకు, ఎల్లయ్య- 47, షేక్ సాదిక్- 58వ ర్యాంకు పొందారు. తెలుగు విభాగంలో సల్మా నాలుగో ర్యాంకు సాధించారు. ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులను కళాశాల వ్యవస్థాపకుడు నాగభూషణం, ఏవోఈ కృష్ణ, ప్రిన్సిపాల్ సత్యనారాయణ అభినందించారు.

పీజీ ఈసెట్ ఫలితాలు:

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ పీజీ ఈసెట్ ఫలితాల్లో కడప జిల్లా జమ్మలమడుగు విద్యార్థి ప్రతిభ చూపారు. నెహ్రూనగర్​కు చెందిన గాలిపోతుల రంజిత్ ఫుడ్ టెక్నాలజీ విభాగంలో మూడో ర్యాంకు సాధించి సత్తా చాటుకున్నాడు . శుక్రవారం విడుదలైన ఫలితాల్లో 75 మార్కులతో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. పీజీ తరువాత పీహెచ్​డీ చేయటం తన లక్ష్యమని విద్యార్థి తెలిపాడు. తన అక్క కవిత ఎస్వీయూలో అగ్రికల్చర్​ విభాగంలో పీహెచ్​డీ చేశారని ఆమెను స్ఫూర్తిగా తీసుకుని తాను చదువుకుంటానని తెలిపాడు.

ఇదీ చదవండి: ఏపీ పీజీఈసెట్-2020 ఫలితాలు విడుదల

Last Updated : Oct 24, 2020, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details