కడప జిల్లా మేరకుమండలంలోని గుంజన ఏరులో సరదాగా ఈతకు వెళ్లిన గుండాలపల్లికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మునిగిపోగా.. ఒకరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. అక్కడ చేపలు పట్టుకునే వ్యక్తి.. మునిగిపోతున్న మరొకరిని బయటికు లాగి రక్షించాడు. అతడిని హుటాహుటిన రైల్వే కోడూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తీసుకువెళ్లారు. మరో యువకుడు ఏరులో మునిగిపోగా.. అతడి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెతికినా ఆచూకీ ఇంకా దొరకలేదు. గల్లంతైన యువకుడు గుండాలపల్లెకు చెందిన విద్యార్థి శివరామకృష్ణగా గుర్తించారు. ఉదయం మరల గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.
కడప జిల్లా గోపవరంలో జలపాతం వద్దకు సరదాగా ఈత కోసం వెళ్లిన విద్యార్థి మృత్యువాత పడ్డారు. అతడు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కృష్ణంపల్లెకు చెందిన మస్తానుగా పోలీసులు గుర్తించారు. బద్వేలులోని బంధువులు ఇంటికి రాగా.. తోటి స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు వెళ్లాడు. సరదా కోసం నీటిలోకి దిగి గల్లంతయ్యాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి.. తోటి స్నేహితులు సమాచారం ఇచ్చారు. తరలివచ్చి సిబ్బంది.. లోపల ఇరుక్కుపోయిన విద్యార్థి శవాన్ని బయటకు తీసుకు వచ్చారు.
చిత్తూరు జిల్లాలో...