కడప జిల్లా వేంపల్లె ప్రభుత్వాస్పత్రిలో స్వీపర్‌గా పని చేస్తున్న లక్ష్మీప్రసన్న ఆత్మహత్యాయత్నం చేసింది. ఆదే ఆస్పత్రిలో పనిచేస్తున్న సూపర్వైజర్ సుదర్శన్ వేధింపులు తాళలేక మనస్థాపం చెంది ఈ దారుణానికి పాల్పడినట్లు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె మందులు మింగటంతో అది గమనించిన బంధువులు హుటాహుటిన వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనకు బాధ్యుడైన సూపర్వైజర్ పై చర్యలు తీసుకోవాలని వారి బంధువులు డిమాండ్ చేశారు.
వేంపల్లెలో స్వీపర్ ఆత్మహత్య యత్నం - కడప జిల్లాలో తాజా వార్తలు
కడప జిల్లా వేంపల్లెలో ఉన్నతాధికారి వేధింపులతో మనస్థాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను కడప రిమ్స్ కు తరలించారు.
వేంపల్లెలో స్వీపర్ ఆత్మహత్య యత్నం