కడప జిల్లా పెనగలూరు మండలం గట్టువారిపల్లిలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన యువతి తల్లిదండ్రులు కుమార్తె మరణవార్త విని స్వస్థలానికి చేరుకున్నారు. తమ కుమార్తె చనిపోయిన తీరు చూస్తుంటే, ఎవరో హత్య చేసి, ఉరి వేసినట్లు ఉందని తండ్రి ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె మృతిపై పెనుమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి ఆత్మహత్య చేసుకుందా, లేదా ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: