కడప జిల్లా రైల్వేకోడూరులో అనుమానమే పెనుభూతమై కట్టుకున్న భార్యను ఆమె భర్త దారుణంగా హతమార్చాడు. మండలంలోని జంగిటివారిపల్లెకు చెందిన ఉమ్మడి సుబ్రహ్మణ్యం, కృష్ణవేణి దంపతులు గ్రామ సమీపంలోని పొలంలో నివాసం ఏర్పరుచుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది.
కట్టుకున్నోడే కాలయముడయ్యాడు - Suspicious Husband killed wife at railwaykoduru news
కలకాలం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కడప జిల్లా రైల్వేకోడూరులో అనుమానమే పెనుభూతమై కట్టుకున్న భార్యను ఆమె భర్త దారుణంగా హతమార్చాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలో చిన్నపాటి మనస్పర్ధలు రావడం.. దానికితోడు భార్యపై అనుమానం పెంచుకోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దంపతులిద్దరూ పొలం వద్ద పనులు చేస్తూ ఉండగా ఏమైందో ఏమో ఉన్నట్టుండి వాగ్వాదానికి దిగారు. క్షణికావేశానికి గురైన సుబ్రహ్మణ్యం కత్తితో కృష్ణవేణిపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రగాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. స్థానికుల సమాచారంతో సీఐ ఆనందరావు, ఎస్.ఐ.పెద్ద ఓబన్న ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానంతోనే ఆమెను భర్త హతమార్చాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.