కడప జిల్లాలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పట్టణానికి చెందిన శ్రీనివాసులు స్థానిక ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో రెండేళ్లనుంచి ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిన్న ఉదయం విధులకు హాజరైన శ్రీనివాస్... ఈ రోజు తెల్లవారుజామున ఆసుపత్రిలోనే మృతిచెందాడు. సిబ్బంది ఇంటికి ఫోన్‌చేసి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లి చూడగా శ్రీనివాస్ మృతిచెంది ఉన్నాడు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఆసుపత్రి సిబ్బందే హత్యచేసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రీకరిస్తున్నారని మృతుని భార్య ఆరోపించారు. అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఆసుపత్రిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
కడపలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో ల్యాబ్ టెక్నిషీయన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఆసుపత్రిలో వ్యక్తి అనుమానస్పద మృతి