కడప జిల్లాలోని ఆలయాలు, ప్రార్థనా మందిరాలపై దాడులు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిఘా పెంచుతున్నామని కడప కలెక్టర్ హరికిరణ్ పేర్కొన్నారు. అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, భద్రతను కట్టుదిట్టం చేస్తామని చెప్పారు. సంక్రాంతి పండుగ అనంతరం ప్రతి నియోజకవర్గంలోనూ.. కమిటీలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి విగ్రహాల ధ్వంసం జరగలేదని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో.. ప్రార్థనా మందిరాల వద్ద బీట్ కానిస్టేబుళ్లను నియమిస్తామని తెలిపారు. అలాగే స్థానికంగా ఉన్న యువత రాత్రి సమయంలో ఆలయాల వద్ద పడుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం పెడితే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
విగ్రహాలపై దాడులను అరికట్టేందుకు నిఘా కట్టుదిట్టం - కడప న్యూస్
కడప జిల్లాలో విగ్రహాలపై దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలోనూ కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి విగ్రహాల ధ్వంసం జరగలేదని పేర్కొన్నారు.
విగ్రహాలపై దాడులను అరికట్టేందుకు కడప జిల్లాలో నిఘా కట్టుదిట్టం