కడప కార్పొరేషన్ మేయర్గా రెండోసారి ఎన్నికవడం అదృష్టంగా భావిస్తున్నట్లు కడప నూతన మేయర్ సురేశ్ బాబు అన్నారు. కడప నగరపాలక సంస్థ మేయర్గా ఎన్నికైన సురేష్ బాబును కలెక్టర్ హరికిరణ్, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సన్మానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కావడంతో కడపను సుందరంగా తీర్చిదిద్దుతానని మేయర్ సురేష్ బాబు అన్నారు. నగరంలోని మొత్తం 50 డివిజన్లకు గానూ, 48 డివిజన్లలో వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. ఒక డివిజన్లో తెదేపా, మరో డివిజన్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
కడప మేయర్గా రెండోసారీ సురేశ్ బాబు ఎన్నిక - kadapa corporation elections
కడప కార్పొరేషన్ మేయర్గా రెండోసారీ సురేశ్ బాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయనను జిల్లా కలెక్టర్, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సన్మానించారు.
కడప మేయర్గా రెండోసారీ సురేశ్ బాబు ఎన్నిక